ఎప్పుడు వివాదాల వెంట పడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అనారోగ్య సమస్యలు వెంటపడుతున్నాయా? ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ట్రంప్ ఆరోగ్యంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం యూఎస్ సైనిక అకాడమీలో శనివారం ట్రంప్ మాట్లాడే సమయంలో కుడిచేతితో మంచినీటి గ్లాస్‌ను తీసుకునేందుకు ట్రంప్ చాలా ఇబ్బంది పడ్డారు. నీరు తాగేందుకు గ్లాస్‌ను పైకెత్తడానికి ఎడమ చేతి సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఆర్మీ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ అనంతరం మెట్లు దిగి వచ్చే సందర్భంలోనూ ఇబ్బంది పడ్డారు. అమెరికాలో ఎన్నికల ఆయన వలస పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంతోనే ఆయన అలసటకు గురయ్యారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ట్రంప్ వ్యతిరేకులు మాత్రం ఆయన ఆరోగ్యం తీవ్రంగా గాడితప్పిందంటూ ప్రచారం చేస్తున్నారు.