ఓ వ్యక్తి చంటిపిల్లాడిని చంకనేసుకుని వెళ్లినట్లుగా మొసలిని భుజానికేసున్నాడు. ఓ టిక్‌టాక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి మొసలిని పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా స్వీటీ అని పేరు పెట్టుకున్నాడు. అందంగా కనిపించేందుకు ఎల్లో టీ షర్ట్ కూడా వేసి దాన్ని ఎత్తుకోగానే అది కూడా ఆనందంగా తోకూపుతూ బుద్ధిగా నడుచుకుంది. మొసలిని తీసుకుని రెస్టారెంట్ లోపలికి వెళ్లాడు. మొసలి రెస్టారెంట్ కు వెళ్లిన ఈ వీడియోకు టిక్‌టాక్‌లో లైకుల వర్షం కురుస్తోంది.