స్విట్జర్లాండ్ సర్కార్ స్వలింగ సంపర్కులకు శుభవార్త చెప్పింది. ఆ దేశంలో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునేందుకు రూపొందించిన బిల్లుకు లైన్ క్లీయర్ అయింది. పశ్చిమ ఐరోపాతో పాటు ఇతర ప్రాంతాల్లోని స్వలింగ సంపర్క జంటలు వివాహం చేసుకునేందుకు స్విట్జర్లాండ్ దిగువసభ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. సంప్రదాయ వాదులు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. స్వలింగ సంపర్కులు పిల్లలను పొందేందుకు, వీర్య దానం చేసేందుకు అనుమతించేందుకు అక్కడి దిగువ సభ తన ఆమోదం తెలిపింది. ఈ చట్టాన్ని ఇప్పుడు తుది ఆమోదం కోసం ఎగువసభలో ప్రవేశపెట్టారు.