ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1004 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 01:33 PM

ఉద్యోగార్ధులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL శుభవార్త చెప్పింది. ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఓ నోటిఫికేషన్ ద్వారా 600 పోస్టులు, మరో నోటిఫికేషన్ ద్వారా 404 ఖాళీలను భర్తీ చేస్తోంది. గతంలో 500 పోస్టులతో ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 మార్చి 20 వరకు దరఖాస్తుల్ని స్వీకరించింది. కరోనా వైరస్ సంక్షోభం నెలకొనడంతో మరోసారి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో మరో 100 పోస్టుల్ని చేర్చింది. దీంతో మొత్తం 600 పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 21 చివరి తేదీ. అయితే ఫిబ్రవరి 22 నుంచి మార్చి 20 మధ్య అప్లై చేసినవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నీషియన్ అప్రెంటీస్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ లాంటి ట్రేడ్స్‌లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాలతో పాటు దాద్రా అండ్ నగర్ హవేలీలోని యూనిట్లలో వీరిని నియమించనుంది. అడ్మిట్ కార్డుల విడుదల, రాతపరీక్షల వివరాలను త్వరలో వెల్లడించనుంది. ఇక మరో నోటిఫికేషన్ ద్వారా ఈస్టర్న్ రీజియన్‌లో ఖాళీలను భర్తీ చేస్తోంది ఐఓసీఎల్. 404 పోస్టుల్ని ప్రకటించింది. ఇందులో టెక్నీషియన్ అప్రెంటీస్- 221, ట్రేడ్ అప్రెంటీస్- 168, ట్రేడ్ అప్రెంటీస్ (అకౌంటెంట్)- 15 పోస్టులున్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్, మెషినిస్ట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులున్నాయి. దీనికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ 18. ఈ నోటిఫికేషన్ ద్వారా పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఐఓసీఎల్. ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ www.iocl.com/ ఓపెన్ చేసి చూడొచ్చు. రెండు నోటిఫికేషన్ల విద్యార్హతల వివరాలు చూస్తే టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు డిప్లొమా, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత విభాగంలో ఐటీఐ పాస్ కావాలి. ఏడాది అనుభవం ఉన్నవారు, ఇప్పటికే శిక్షణ తీసుకున్నవారు దరఖాస్తు చేయకూడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com