ట్రెండింగ్
Epaper    English    தமிழ்

44 ఏళ్ల మహిళను 19 ఏళ్ల యువకుడు ఎత్తుకెళ్లి...

international |  Suryaa Desk  | Published : Sat, Jun 06, 2020, 03:46 PM

చుట్టూ చెట్లూ, చేమలు. మనుషులెవరూ లేని ప్రాంతం అది. ఆ ఇంటి నుంచి మరో ఇళ్లు దాదాపు అర కిలోమీటర్ అవతల ఉంది. అలాంటి చోటకు... 19 ఏళ్ల ఓ యువకుడు కారులో వచ్చాడు. నీళ్లు కావాలంటూ... ఆమె దగ్గరకు వెళ్లాడు. రోడ్డు పక్కన ఎన్నో ఇళ్లులు ఉన్నాయి. అలాంటిది... ఇంత లోపలకు ఉన్న తమ ఇంటికి వాటర్ కోసం వస్తున్నాడేంటి అనుకుంది ఆ మహిళ. అలా ఆలోచిస్తుంటేనే.. ఆ యువకుడు దగ్గరరకు వచ్చి... సడెన్‌గా గన్ తీసి ఆమె నడుం దగ్గర పెట్టాడు. బుల్లెట్లు నిండుగా ఉన్నాయి. ఒక్క బుల్లెట్ చాలు నిన్ను చంపడానికి అని బెదిరించాడు. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలే కోరనా కారణంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న రోజులివి. అతను ఆమెకు పక్కనే నిల్చున్నాడు. గన్ ట్రిగ్గర్ నొక్కుతుంటే భయపడిన బాధితురాలు... అతను చెప్పినట్లే చేసింది. తన కారు ఎక్కమన్నాడు. ఎక్కింది. ఆమెకు గన్ గురి పెట్టి ఉంచి... ఎక్కడో మారుమూల అడవిలాంటి ప్రదేశంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లాడు. ఆమె లోపలికి వెళ్లేందుకు వెనకడుకు వేస్తుంటే... బలవంతంగా నెట్టాడు. అమె గట్టిగా అరుద్దామన్నా... అక్కడ చుట్టూ ఏమీ లేవు. ఎవరూ లేరు. ఆమెను రేప్ చేశాడు. గన్ గురి పెట్టి బెదిరించడంతో... ఆమె అతని నుంచి తప్పించుకోలేకపోయింది. అమెరికా... ఇండియానా రాష్ట్రంలోని... ఎలెక్‌హార్ట్ కౌంటీలో జూన్ 3న ఈ దారుణం జరిగింది. అత్యాచారం తర్వాత... అతను మరో గదిలోకి వెళ్లాడు. అక్కడి నుంచి తప్పించుకొని... పారిపోయిన ఆమెకు... రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత రోడ్డు కనిపించింది. అటువైపు వస్తున్న ఓ వాహనాన్ని ఆపి... పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. కొన్ని నిమిషాల్లో అక్కడికి వచ్చిన పోలీసులు... ఆమె నుంచి నిందితుడి వివరాలు సేకరించారు. ఆమెను ప్రత్యేక వాహనంలో ఆస్పత్రికి పంపారు. తర్వాత... తుప్పలున్న ఇంటికి వెళ్లారు. పోలీసుల్ని చూడగానే... మ్యూజిక్ వింటున్న ఆ దుర్మార్గుడు ఆ పని ఆపాడు. నా దగ్గరకు రావొద్దు. కాల్చుకొని చస్తాను. అంటూ... తన గన్‌ను తనకే గురిపెట్టుకుని బెదిరింపులకు దిగాడు కొంతసేపు సీన్ క్రియేట్ చేశాక... పోలీసులు.. నీకు ఏం కాదు... ఏమవ్వదు... అని బుజ్జగించి... అతడిని పట్టుకుని గన్ లాక్కున్నారు. కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడిపై కిడ్నాప్, రేప్, పోలీసుల్ని బెదిరించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. కొన్ని రోజులుగా... ఆ ఇంట్లో మధ్యాహ్నం వేళ మహిళ మాత్రమే ఉండటాన్ని గమనించి అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com