ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుగులేని టెన్నిస్ స్టార్.. మరియా షరపోవా

international |  Suryaa Desk  | Published : Sat, Jun 06, 2020, 11:42 AM

బాల్యంలో పేదరికంపై యుద్ధం. కెరీర్ మధ్యలో అనుకోని డ్రగ్స్ వివాదం. ఆడకుండా నిషేధం. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులతో యుద్ధం. సివంగిలా ఈ రెండింట్లోనూ ఆడి గెలిచింది రష్యా అందాల టెన్నిస్ తార మరియా షరపోవా. అమెరికాలోని మార్టినా నవ్రతిలోవా అకాడమీలో ఆమెకు శిక్షణ ఇప్పించడం తండ్రికి చాలా కష్టమైంది. అప్పుచేసైనా సరే కూతురిని గొప్ప టెన్నిస్ క్రీడాకారిణిని చేయాలని తండ్రి తపించాడు. మరియా 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మారింది. జూనియర్స్ టోర్నీల్లో అనితర సాధ్యమైన విజయాలతో మెరుపులు మెరిపించింది. కేవలం 17 ఏళ్ల వయసులో వింబుల్డన్ మహిళల సింగిల్స్ చాంపియన్ షిప్ సాధించింది. ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా? నాన్నా ఇక మనం అప్పులు తీర్చవచ్చు అని. షరపోవా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరో విషయం తెలుసుకోవాలి.భారతదేశపు అత్యంత నమ్మకమైన ఆన్‌లైన్ రమ్మీ ఫ్లాట్‌ఫారం, రమ్మీకల్చర్‌పై అత్యంత ఆకర్షణీయమైన రివార్డులు ఎంజాయ్ చేయండి. ఈ గేమ్ ఇన్ స్టాల్ చేసుకొని లాక్ డౌన్ ను ఎంజాయ్ చేయడమే కాకుండా డబ్బు కూడా సంపాదించుకోండి.ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల 90 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ అందుకుంది. అత్యంత సంపన్నులైన క్రీడాకారిణుల్లో ఒకరైంది. టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లోనూ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెల్చుకుని కెరీర్ స్లామ్ సాధించిన అతి కొద్ది మంది మహిళల్లో షరపోవా ఒకరు. ఫ్రెంచ్ ఓపెన్ లో ఒకసారి, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ లో ఒక్కోసారి టైటిల్ గెల్చింది. డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ లో కూడా ఆమెది ఘనమైన రికార్డు. కోట్ల మంది అభిమానులకు ఇప్పటికీ ఆమె తిరుగులేని టెన్నిస్ స్టార్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com