ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటన్‌కు చెందిన ప్రపంచ కురవృద్ధుడు కన్నుమూత

international |  Suryaa Desk  | Published : Fri, May 29, 2020, 11:02 AM

ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా రికార్డుకెక్కిన బాబ్ వెయిటన్(112) కన్నుమూశారు. గురువారం రాత్రి ఆయన నిద్రలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బాబ్ మరణాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. బ్రిటన్‌కు చెందిన బాబ్ వెయిటన్ ఇటీవలే ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందారు. ఇది జరిగిన మూడు నెలలకే ఆయన కన్నుమూశారు. ఆయన మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 


బాబ్ వెయిటన్ ఈస్ట్‌ యార్క్‌షైర్‌లో 1908 మార్చి 29న జన్మించారు. తైవాన్‌, జపాన్, కెనడాలో ఆయన ఇంజనీర్‌గా పనిచేశారు. అతని జీవితం కాలంలో మొత్తం 26 మంది బ్రిటన్ ప్రధానుల పరిపాలనను బాబ్‌ చూశారు. కాగా జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబే 112 సంవత్సరాల 355 రోజుల వయసులో 23 ఫిబ్రవరి 2020న మృతి చెందారు. దీంతో ఆ తర్వాత బాబ్ రికార్డుకెక్కారు. కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం వణికిపోతున్న విషయం తెలుసుకొని ఆయన ఆశ్చర్యపోయినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈయనకు 10 మంది మనుమలు, 25 మంది ముని మనమలు ఉన్నారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com