ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 56 లక్షలు దాటాయి. ప్రపంచ ఆరోగ్య నివేదికల వివరాల మేరకు.. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 56,84,803 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,52,225 మంది మృతి చెందారు. కరోనా బారినపడి 24,30,603 మంది కోలుకున్నారు.