మాజీ ప్రియుడిపై ఉల్లిపాయలతో ప్రతీకారం తీర్చుకున్న యువతి

  Written by : Suryaa Desk Updated: Fri, May 22, 2020, 12:30 PM
 

తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఒక యువతి వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఏకంగా 1000 కిలోల ఉల్లిపాయలను అతనికి డోర్ డెలివరీ చేసింది. వివరాల్లోకి వెళ్తే చైనాలోని జిబో ప్రాంతంలోని యువతీ యువకులు ప్రేమలో మునిగిపోయారు. ఇటీవల ఆ యువకుడు తన ప్రేయసికి బ్రేకప్ చెప్పాడు. దీంతో ఆమె తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అతను మాత్రం ఆనందంగా ఉండడంతో ఆగ్రహించిన ఆ యువతి ఉల్లిపాయలు డోర్ డెలివరీ చేయడంతో ఇది నెట్టింట వైరల్ అయ్యింది. అతనికి తెలియకుండా ఉల్లిపాయలు ఇంటి వద్ద వేసి రావాలని డెలివరీ సంస్థకు చెప్పింది. "నేను మూడు రోజుల పాటు ఏడ్చాను. ఇక నీ వంతు" అంటూ తన మాజీ ప్రియుడికి మెసేజ్ కూడా పంపింది.