అమెరికాలో ముంచెత్తుతున్న వరదలు

  Written by : Suryaa Desk Updated: Thu, May 21, 2020, 11:26 AM
 

మిచిగాన్: అగ్రరాజ్యంలో అమెరికాలోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా మిచిగాన్ లో తీవ్రరూపంలో వరదలు సంభవించాయి. ఈ వరదల ప్రభావంతో ఈడెన్ విల్లె, శాన్ ఫోర్డ్ వంతెనలు కొట్టుకుపోయాయి.వరదలు తీవ్రంగా ముంచెత్తడంతో జలదిగ్బందంలోనే పలుకాలనీలు చిక్కుకుపోయాయి. దీంతో వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.