యూకే ఇప్పటికే కరోనా కరోనా వైరస్ తో పోరాడుతోంది. ఇంతలోనే మారిన వాతావరణం బ్రిటన్ ను ఇబ్బందుల్లోకి నెట్టివేసేలా కనిపిస్తోంది. ఆదివారం భారీ వర్షం కురిసింది. ఇదే కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ వాతావరణ శాఖ శాస్త్రవేత్త టామ్ మోర్గాన్ మాట్లాడుతూ బ్రిటన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశామన్నారు. సాధారణంగా ఏప్రిల్ నెలలో బ్రిటన్లు వేసవిని చూస్తుంటారు. కానీ అకస్మాత్తుగా ఆదివారం వాతావరణం మారిపోయింది. వచ్చే వారం నుండి, వాతావరణంలో మరిన్ని మార్పుల రావచ్చని తెలిపారు. ఆదివారం, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే ఇది ఎక్కువ కాలం ఉండదని మరో వాతావరణ శాస్త్రవేత్త మార్కో పటాగ్నా తెలిపారు.