ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Wed, Apr 22, 2020, 02:15 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోకి వలసలను నిరోధించేందుకు ఇమ్మిగ్రేషన్ ను నిలిపేస్తునట్టు ట్రంప్ నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అదృశ్య శక్తి కరోనా కారణంగా దేశ పౌరుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని,వారిని రక్షించుకోవాల్సిన సమయం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ ఉత్తర్వులపై నేడు సంతకం చేయబోతున్నట్టు ట్రంప్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com