ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రెడిట్ కార్డ్ బిల్లు వాయిదా వేసేవారికి షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 13, 2020, 10:59 AM

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే క్రెడిట్ కార్డుపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు మారటోరియం ఎంచుకుంటే 30 నుంచి 40 శాతం వడ్డీ చెల్లించక తప్పదు. మూడు నెలలు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని అనుకున్నా ఆ తర్వాత వడ్డీతో కలిపి బిల్లు ఎక్కువగా చెల్లించక తప్పదు. అసలు మీరు ఎంత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుందో బ్యాంకులే వివరించాయి. వడ్డీ నెలకు రూ.3.5 శాతం అనుకుంటే మీరు చెల్లించాల్సిన వడ్డీ ఎంతో ఉదాహరణ చూడండి. మార్చి 3న చెల్లించాల్సిన క్రెడిట్ కార్డ్ బిల్లు రూ.1,00,000 అనుకుందాం. ఏప్రిల్ 3 నాటికి వడ్డీ- రూ.3,500 అవుతుంది. ఇలా మారటోరియం మూడు నెలలు కాబట్టి మూడు నెలలకు వడ్డీ పడుతుంది. మే 3 నాటికి మొత్తం వడ్డీ రూ.7,122, జూన్ 3 నాటికి మొత్తం వడ్డీ రూ.10,871 అవుతుంది. జూన్ 3న మీరు చెల్లించాల్సిన మొత్తం రూ.1,10,871. అంటే రూ.1,00,000 క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుండా మీరు మూడు నెలలు మారటోరియం ఎంచుకుంటే అదనంగా వడ్డీ రూ.10,871 చెల్లించాలి. అందుకే మీ దగ్గర డబ్బులు ఉంటే క్రెడిట్ కార్డు బిల్లు తప్పని సరిగా చెల్లిస్తే కొంత ఇబ్బంది ఉండదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com