అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కరోనా వైరస్ పరీక్ష రెండోసారి నెగెటివ్‌గా తేలింది. ఈ రోజు ఉదయాన్నే రిపోర్ట్ తీసుకున్నాను. కోవిడ్-19 నెగెటివ్‌గా వచ్చిందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. రెండోసారి పరీక్షకు ట్రంప్ నూతన విధానాన్ని అనుసరించారు. ఈ ర్యాపిడ్ విధానంలో ఒక నిమిషంలోనే పరీక్ష పూర్తవగా 15 నిమిషాల్లో ఫలితం వస్తుంది. ఈ విధానం ఎంతో బాగుందని, సులభతరంగా కూడా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్‌కు మొదటిసారి మార్చి నెల రెండోవారంలో పరీక్ష నిర్వహించారు. ఇన్వాసివ్ పద్దతిలో జరిపిన పరీక్షలో ఫలితం రావడానికి పలు గంటలు పట్టింది. బ్రెజిల్ అధ్యక్ష ప్రతినిధి బృందంతో సమావేశం అనంతరం ట్రంప్‌కు మొదటిసారిగా కరోనా పరీక్షలు నిర్వహించారు. బృందంలోని సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ట్రంప్ పరీక్షలు చేయించుకున్నారు.