కెనడా దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంది. సోఫీ గ్రెగోయిర్ ట్రూడోకు జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని రిపోర్టు రావడంతో ఆమెను ఐసోలేషన్ గదిలో ఉంచి చికిత్స చేశారు. ఈ సందర్భంగా సోఫీ గ్రెగోయిర్ ట్రూడో మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తాను కరోనా నుంచి బయటపడ్డానని, చాలా బాగున్నానని అన్నారు. అలాగే తాను డాక్టరు, ఒట్టావా పబ్లిక్ హెల్త్ విభాగం అధికారి నుంచి కరోనా నుంచి కోలుకున్నట్లు క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందానని తెలిపారు.