కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. క్షణాల్లోనే వందలాది మందికి ఈ వైరస్ సోకుతుంది. తాజాగా బ్రిటన్ రాజకుటుంబాన్ని ఈ వైరస్ తాకింది. ప్రిన్స్ చార్లెస్ కు (71) కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన స్కాట్ ల్యాండ్ లోని తన నివాసంలో స్వీయ నిర్భంధంలో ఉన్నారు. చార్లెస్ భార్య కమిల్లాకు కరోనా నెగటివ్ రిపోర్టు వచ్చింది. ప్రస్తుతం చార్లెస్ పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. బ్రిటన్లో ఇప్పటివరకు 8077 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 422 మంది మృత్యువాతపడ్డారు.