ఢిల్లీలో సీఏఏకి వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో శాఖలో పనిచేస్తున్న ఆఫీసర్ డ్రైనేజిలో శవమై తేలాడు.అల్లర్ల నేపధ్యంలో అంకిత్ శర్మ అనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంతో ఆయన కోసం గాలింపు చేపట్టగా డ్రైనేజీలో ఆయన శవం లభ్యమైంది. సీఏఏ అల్లర్లు ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన సంగతి తెలిసిందే.