తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఈ ఉదయం స్వామివారి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, వారికి గరిష్ఠంగా మూడు గంటల వ్యవధిలోనే దర్శనం పూర్తి కానుంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు, రూ. 300 ప్రత్యేక దర్శనం, నడకదారి భక్తుల దివ్యదర్శనాలకు రెండు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు.