స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాకు గర్వకారణమైతే…భారత్ కు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గర్వకారణమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ అమెరికా-భారత్ సంబంధాలు ఇంకెంత మాత్రం మరో భాగస్వామ్యంగా మిగిలిపోజాలవని అన్నారు. అవి అంతకంటే గొప్ప, సన్నిహిత సంబధమని పేర్కొన్నారు. అమెరికా ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్ అయితే…ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న విశ్వాసం భారత్ ది అని మోడీ అన్నారు. అమెరికా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గర్వకారణమైతే…భారత్ కు స్టాట్యూ ఆఫ్ యూనిటీ గర్వకారణమని మోడీ చెప్పారు.