ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాట పాడిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌..

national |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2020, 09:07 AM

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్‌ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ధన్యవాద్‌ ఢిల్లీ పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సమయంలో షరతుతో నేను ఒక పాట పాడతాను. నేను పాట పాడితే నాతోపాటు మీరు కూడా పాడాలి. మనందరి సమిష్టి కలను నెరవేర్చుకునేందుకు ఈ ప్రార్థన అని కేజ్రీవాల్ ఆహూతులకు చెప్పారు. ఆ విధంగానే ఈ కార్యక్రమంలో భాగంగా కేజ్రీవాల్ ‘హమ్ హోంగే కామ్ యాబ్’ (we shall overcome) పాటను పాడి..అందరితో పాడించారు. ఈ పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది.


1960 లలో యూఎస్ లో పౌర హక్కుల ఉద్యమం సమయంలో ‘we shall overcome’ పాట ఎంతో ప్రాచుర్యం పొంది..ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఇదే పాటను హిందీ కవి గిరిజా కుమార్ మాథుర్ హమ్ హోంగే కామ్ యాబ్ పేరుతో హిందీలోకి అనువాదం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com