పుల్వామా దాడిపై మోడీకి మూడు ప్రశ్నలు సంధించిన రాహుల్

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 14, 2020, 07:40 PM
 

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగి శుక్రవారంనాటికి సరిగ్గా ఏడాదైంది. ఈ రోజున యావద్దేశం వీరజవాన్ల ప్రాణత్యాగానికి నివాళులు అర్పిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై శుక్రవారంనాడు ప్రశ్నల వర్షం కురపించారు. పుల్వామా దాడి నుంచి ఎక్కువగా లబ్ధి పొందిందెవరు? అంటూ నిలదీశారు. దాడిపై జరిపిన ఎంక్వయిరీలో ఏం తేలిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాహుల్ మోడీకి మూడు ప్రశ్నలు సంధించారు. పుల్వామా దాడి నుంచి ఎవరు ఎక్కువగా లబ్ధి పొందారు, దాడిపై జరిపిన దర్యాప్తులో ఏం తేలింది? దాడికి దారితీసిన భద్రతా లోపంపై బీజేపీ ప్రభుత్వం ఎవరినైనా జవాబుదారిగా గుర్తించిందా? అని రాహుల్ మూడు ప్రశ్నలను మోడీకి సంధిస్తూ ట్వీట్ చేశారు.