విద్యార్థినుల లోదుస్తులను తొలగించాలని బలవంతం..

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 14, 2020, 06:02 PM
 

గుజరాత్‌లోని ఓ కాలేజీ యాజమాన్యం విద్యార్థునుల పట్ల దారుణంగా ప్రవర్తించింది. విద్యార్థినుల లోదుస్తులను తొలగించాలని బలవంతం చేసింది. పిరియడ్స్ వచ్చిందా? లేదా చూపించాలని కాలేజీ ప్రిన్సిపల్ ఆదేశించింది. దాదాపు కాలేజీలోని 68 మంది విద్యార్థులను వాష్ రూంలోకి తీసుకెళ్లి ఒక్కొక్కరిని వరుసగా నిలబెట్టి దుస్తులు విప్పించింది. ఈ దుర్మాగమైన చర్యకు పాల్పడిన ఘటన గుజరాత్ లో శ్రీ సహజానంద్ బాలికల విద్యాసంస్థలో జరిగింది. పిరియడ్స్ సమయంలో విద్యార్థినులు తమ కాలేజీలో కొన్ని వస్తువులు, ప్రదేశాలకు దూరంగా ఉంచేందుకే కాలేజీ యాజమాన్యం ఇలాంటి చర్యకు పాల్పడినట్టు కనిపిస్తోంది. 


విద్యార్థినులు నెలసరి సమయంలో కాలేజీలోని ఆలయ‍ంలోకి ప్రాగంణంలోకి, కిచెన్‌ లోపలికి తరచూ వెళ్తున్నారని, అక్కడి వస్తువులతో పాటు అందరిని తాకుతున్నారంటూ హాస్టల్ వార్డెన్ విద్యార్థినులపై ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ వెంటనే విద్యార్థినులందరిని తన వద్దకు పిలిపించుకున్నారు. వారందరిని వాష్ రూంలోకి తీసుకెళ్లి దుస్తులు విప్పాలని ఆదేశించింది.