పాకిస్థాన్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్జాహిని.. షూట్ చేసిన తాలిబన్ ఉగ్రవాది ఇషానుల్లా ఇషాన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. 2014లో పెషావర్‌లో ఆర్మీ స్కూల్‌పై జరిగిన దాడికి కూడా ఈ ఉగ్రవాదే బాధ్యుడు. తాజాగా రిలీజైన ఆడియో క్లిప్‌లో.. తాను పోలీసుల చెర నుంచి తప్పించుకున్నట్లు ఉగ్రవాది ఇషాన్ చెప్పాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ క్లిప్ వైరల్ అవుతోంది. జనవరి 11న పోలీసుల అదుపు నుంచి బయటపడినట్లు అతను తెలిపాడు. 2017లో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే తనకు ఇచ్చిన వాగ్దానాన్ని పోలీసులు నెరవేర్చలేదన్నాడు. 2012లో పాక్‌లోని స్వాట్ వ్యాలీలో విద్యా హక్కుల గురించి ప్రచారం చేస్తున్న సమయంలో మలాలాపై ఉగ్రవాది ఇషాన్ కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో మలాలా తలలోకి బుల్లెట్ దిగింది.