ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పది రూపాయాలకే అద్దెకు గర్ల్ ఫ్రెండ్

international |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2020, 05:00 PM

సహజంగా కారునో, బైకునో అద్దెకు తీసుకోవడం గురించి విన్నాం.. కానీ గర్ల్ ఫ్రెండ్స్‌ని అద్దెకు అందించే సర్వీస్ గురించి ఎప్పుడైనా విన్నారా..? వినటానికి ఆశ్చర్యంగా ఉన్న అక్షరాల ఇది నిజం. ఎమౌంట్ కూడ వేలే.. లక్షలో కాదోండోయ్. కేవలం పది రూపాయాలు మాత్రమే. అయితే ఆ సర్వీస్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. చైనాలోని ఓ షాపింగ్ మాల్ కుర్రాళ్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కేవలం పదంటే పది రూపాయాలకే అద్దెకు గాళ్ ఫ్రెండ్ ను పంపిస్తోంది. చైనాలో గ్వాంగ్ డాంగ్ ప్రావిన్సులోని హ్యూవాన్ సిటీలో ది విటాలిటీ సిటీ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడికి వచ్చే యువకులకు అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్ ని అందుబాటులో ఉంచింది ఆ షాపింగ్ మాల్.
షాపింగ్ కోసం అమ్మాయి తోడు కావాలంటే 20 నిమిషాలకు 10 రూపాయాలు చెల్లించాలి. అమ్మాయిలు పోడియం వద్దే ఉంటారు. ఎవరు నచ్చితే ఆ ఆమ్మాయిని షాపింగ్ కు తీసుకెళ్లోచ్చు. కేవలం 20 నిమిషాలు మాత్రమే తోడుగా వస్తారు. 20 నిమిషాలు దాటితే మళ్లీ 10 రూపాయాలు చెల్లించాల్సిందే. అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడ అద్దెకు యువతులు వస్తారు. ఈ షాపింగ్ మాల్ లో ఎప్పటికి 15 మంది యువతులు సిద్దంగా ఉంటారు. పిల్లలను ఎత్తుకోవడం, షాపింగ్ బ్యాగ్స్ పట్టుకోవడం లాంటి సేవలు అందిస్తారు. అంతేకాదు లంచ్, డేటింగ్ కోసం కూడ కస్టమర్లను తీసుకెళ్లచ్చని షాపింగ్ మాల్ యాజమాన్యం చెబుతోంది. అయితే కండీషన్స్ అప్లై అంటున్నారు షాపింగ్ మాల్ నిర్వహకులు చెబుతున్నారు. లంచ్, డేటింగ్ తీసుకెళ్లిన కానీ ముట్టుకోకూడదు. షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణం దాటి ఎక్కడికి వెళ్లకూడదని నిబంధన పెట్టారు. కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు ఈ తరహ అరెంజ్ మెంట్ చేసింది షాపింగ్ మాల్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com