ప్రసుత్తం సెనేట్‌లో అభిశంసన విచారణను ఎదుర్కొంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లికన్ సెనేటర్ల మద్దతుపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సెనేట్‌లో ట్రంప్ అభిశంసనపై బుధవారం (5వ తేదీ) జరిగే ఓటింగ్‌లో రిపబ్లికన్లు ట్రంప్‌కు పూర్తి మద్దతు ఇస్తారని కొందరు, రిపబ్లికన్లలో చీలక వస్తుందని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇటీవల జరిగిన టీవీ టాక్‌షో కార్యక్రమాల్లో పాల్గొన్న రిపబ్లికన్ పార్టీ నేతలు కొందరు తమ మద్దతు ట్రంప్కేనన్నారు. అయితే రిపబ్లికన్ల ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.