ప్రతీకారం తోనే బాంబు పెట్టా

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 02:36 PM
 

వ్యవస్థను బాగు చేయాలన్న ఉద్దేశంతోనే  విమానాశ్రయంలో బాంబు పెట్టానని మంగళూరు నిందితుడు చెప్పాడు. సమాజంలో ఏ వ్యవస్థ సక్రమంగా లేదని అయన అన్నారు.  మంగళూరు విమానాశ్రయంలో సోమవారం బ్యాగులో ఉన్న బాంబును నిఘా అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ బాంబు పెట్టిన ఆదిత్యరావు అనే వ్యక్తి అనంతరం బెంగళూరు వెళ్లి పోలీసుల వద్ద స్వచ్ఛందగా లొంగిపోయాడు. అయితే పోలీసుల విచారణలో అతను.. నా వద్ద డబ్బు లేదు. ఎవరూ నన్ను గుర్తించి గౌరవించం లేదు. సమాజంలో వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదు. అందుకే తీవ్ర అసంతృప్తి కలిగింది. వ్యవస్థపై ప్రతీకారంతోనే విమానాశ్రయంలో బాంబు పెట్టాలనుకున్నాను. తీరా పెట్టాక తప్పుచేశానని అనిపించింది. అందుకే బెంగళూరు పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాను' అంటూ వివరణ ఇచ్చాడు.