ఎయిర్‌పోర్ట్‌లో కూలిన విమానం

  Written by : Suryaa Desk Updated: Thu, Jan 23, 2020, 11:03 AM
 

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా కరోనా మున్సిపల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. కరోనా ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఉదయం చిన్నపాటి సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్ అవుతుండగా, విమానం గాలిలో ప్రయాణించలేకపోయింది. ఆ తర్వాత విమానం ఫెన్స్‌ను తాకుతూ కుప్పకూలి విమానాశ్రయానికి తూర్పున ఉన్న బారికేడ్‌ను తాకింది. 80 గ్యాలన్ల ఇంధనాన్ని మోస్తున్న విమానం, ఆపై పల్టీలు కొట్టి మంటల్లో చిక్కుకుంది తర్వాత మంటలు చెలరేగాయి. పైలట్‌కు విమానంపై కంట్రోల్‌ తప్పిందని రన్‌వేపై చాలా వేగంగా విమానం పరిగెత్తిందని ప్రమాద ఘటనను వీక్షించిన మరో పైలట్‌ దొర్తీ వోల్‌ చెప్పారు.