ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ పాక్ జట్టులోకి తీసుకోవద్దు పాక్ క్రికెటర్ పై నెటిజన్ల ఫైర్ !

national |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 06:20 PM

నెటిజన్ల అలీని మళ్లీ పాక్ జట్టులోకి తీసుకోకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెటిజన్ల ఆగ్రహానికి ఓ కారణం ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు హ‌స‌న్ అలీ అందుబాటులో లేడు. ఇక శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ప్రకటించిన పాక్ జట్టులో కూడా లేడు. పక్కటెముకల గాయంతో బాధ పడుతున్న కారణంగా అలీని పాక్ సెలెక్టర్లు పక్కన పెట్టారు. బుధవారం నుంచి రావల్పిండి క్రికెట్‌ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో హసన్‌ అలీ ర్యాంప్‌ వాక్‌ చేసాడు. ఈ సమయంలో అతను ఎలాంటి అసౌకర్యాలకు గురికాలేదు. బంగారపు రంగు షెర్వానీ ధరించిన హసన్ అలీ.. ర్యాంప్‌ వాక్‌ చేస్తూ చాలా ఉత్సాహంగా గడిపాడు. హసన్ అలీ ర్యాంప్‌ వాక్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి తిరిగి జట్టులోకి వస్తావనుకుంటే.. ర్యాంప్‌ వాక్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా అని ఓ నెటిజన్ మండిపడ్డాడు. 'ఆటను వదిలేసావు. మరి మోడలింగ్‌ ఎందుకు చేస్తున్నావు. గాయం అడ్డురావడం లేదా. నిన్ను అసలు మళ్లీ పాక్‌ జట్టులోకి తీసుకోకూడదు' అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com