ఛత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లాలో పెద్దపులిని హతమార్చిన నిందితుల పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మంది నిందితులను పోలిసుల అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇందులో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడ ఉన్నారు. పులి చర్మాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.