కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు దూర దృష్టి లేదని కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. ఒక వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నిర్బలా సీతారామన్‌గా అభివర్ణించారు. ఆమె పట్ల తనకు అపార గౌరవం ఉందని కానీ ఆర్థిక మంత్రిగా ఆమె సొంతంగా నిర్ణయాలు తీసుకొనే పరిస్థితిలో లేరని అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు నిర్మలా సీతారామన్‌కు లేవనీ, అందుకే ఆమెను నిర్మలా సీతారామన్‌గా అభివర్ణిస్తున్నానని పేర్కొన్నారు. దేశ ఆర్థిక మంత్రి హోదాలో దేశంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే విషయంలో ఆమె సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేరనీ, కనీసం ఆమె ఏం భావిస్తున్నారో చెప్పే పరిస్థితి కూడా లేదని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.