ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియాంక గాంధీ పేరు పలకబోయి తప్పుగా.. తప్పులో కాలేసిన మాజీ ఎంఎల్ఎ

international |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2019, 09:08 PM

ప్రియాంక గాంధీ పేరు పలకబోయి తప్పుగా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పేరు పలికి ఓ కాంగ్రెస్ ఎంఎల్ఎ నవ్వులపాలయ్యాడు. ఆదివారం దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఎ సురేందర్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, ప్రియాంక చోప్రా జిందాబాద్ అంటూ గట్టిగా అనడంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే, తన తప్పును తెలుసుకొన్న మాజీ ఎంఎల్ఎ వెంటనే ప్రియాంక గాంధీ జిందాబాద్ అని అన్నాడు. దీంతో ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ.. నెక్ట్స్ ఏంటీ, నిక్ జోనస్ జిందాబాద్.. అని, ప్రియాంక చోప్రా పట్ల మీకున్న దయకు ఆమె మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతుందని కామెంట్స్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com