పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ విజయం దిశగా దూసుకుపోతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 39-3 వద్ద నిలిచింది. కెప్టెన్ అజహర్ అలీ(9) సహా ఇమాముల్ హక్(0), బాబర్ ఆజమ్(8) పెవిలియన్ బాట పట్టారు. క్రీజులో షాన్ మసూద్(14 నాటౌట్), అసద్ షఫిక్(8) ఉన్నారు. మిచెల్ స్టార్క్ 1 వికెట్, హెజెల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా, పాక్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును చేరుకోవడానికి ఇంకా 248 పరుగులు చేయాల్సి ఉంది. 91-6తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ 94.4 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో పాక్‌ను గడగడలాడించగా.. కమిన్స్ 3 వికెట్లు, హెజెల్‌వుడ్ 1 వికెట్ తీసుకున్నారు. తదనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ బ్యాట్స్‌మెన్ ఆసీస్ బౌలర్ల ధాటికి ఏ మాత్రం క్రీజులో నిలబడలేకపోయారు. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. కాగా, ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ వార్నర్ రికార్డు ట్రిపుల్ సెంచరీ(335 నాటౌట్)తో చెలరేగడంతో పాక్ ముందు భారీ స్కోరు (589/3) ఉంచింది. డే/నైట్ టెస్టులో ఇది వరకు వార్నర్ స్కోరే అత్యధికం. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో రెండో అత్యధిక స్కోరు(335) సాధించిన బ్యాట్స్‌మెన్‌గా వార్నర్ నిలిచాడు. హెడెన్ 380 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు.