తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ముందు యువతి ధర్నా నిర్వహించింది. తనకు న్యాయం చేయాలని చేబ్రోలు గ్రామం ఎస్సీకాలనీకి చెందిన బండి దుర్గ భవాని ఆందోళనకు దిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రేమించి, అదే గ్రామానికి చెందిన సలాది నాగేశ్వరరావు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బైఠాయించింది. గంగాభవాని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.