ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరో డే నైట్ టెస్టుపై కన్నేసిన ఆస్ట్రేలియా

international |  Suryaa Desk  | Published : Thu, Nov 28, 2019, 04:45 PM

అడిలైడ్ ఓవల్ వేదికగా శుక్రవారం నుంచి పాకిస్థాన్‌తో ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. బ్రిస్బేన్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నట్లు ఆస్ట్రేలియా జట్టు టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ పేర్కొన్నారు. అయితే, కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కామెరూన్ బాన్‌క్రాప్ట్‌ను విడుదల చేసింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగే డే నైట్ టెస్టులో తమ ప్రధాన బౌలర్లకు లోడ్ తగ్గించే క్రమంలో 12వ ఆటగాడిగా స్వింగ్ బౌలర్ మైకేల్ నెసెర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. జట్టు ఎంపికపై టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ మాట్లాడుతూ "మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నాం. గత వారంలో బ్రిస్బేన్‌లో సహజంగానే మంచి క్రికెట్‌ ఆడాము. మా పేస్ ఎటాక్ అద్భుతంగా ఉంది. పింక్ బాల్ టెస్టులో అనేక రికార్డులను బద్దలు కొట్టాం కాబట్టి జట్టుని మార్చవలసిన అవసరం లేదు" అని తెలిపాడు. "దేశవాళీ క్రికెట్‌‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరుఫున ఆడేందుకు గాను కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌ను జట్టు నుంచి విడుదల చేశాం. కాబట్టి కాంకషన్ విషయంలో అతడికి బ్యాటింగ్ ప్రత్యామ్నాయం ఇంకా ఆలోచించలేదు" అని టిమ్ పైన్ తెలిపాడు. గత వారంలో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా భారత్‌తో జరిగిన డే నైట్ టెస్టులో ఒకేరోజు బంగ్లాదేశ్ ఇద్దరు కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌లను ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. ఈ డే నైట్ టెస్టులో ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్‌ఉడ్‌లను పాకిస్థాన్ జట్టుకు ఎలా ఎదుర్కొంటునేది అతిపెద్ద సవాల్‌. ఇప్పటివరకు జరిగిన డే నైట్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లలో మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ మరియు నాథన్ లియోన్‌‌లు ఉన్నారు. పాట్ కమ్మిన్స్ ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. నాలుగేళ్ల క్రితం ఐసీసీ ఈ డే నైట్ టెస్టు మ్యాచ్‌లకు అనుమతిచ్చిన తర్వాత ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఐదు డే నైట్ టెస్టు మ్యాచ్‌లను ఆడింది. ఈ ఐదు డే నైట్ టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియానే విజయం సాధించడం విశేషం. అడిలైడ్ ఓవల్ పిచ్ పేసర్లకు స్వర్గధామం. ఈ నేపథ్యంలో ఆసీస్ పేసర్లు ఎలా రెచ్చిపోతారో చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com