ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్నిబలోపేతం చేస్తూ మరో ముందడుగు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 01:42 PM

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ మరో కీలక ముందుడుగు వేసింది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ  పథకం  విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారిని కూడా ఈ పథకానికి వర్తింపచేసింది. అలాగే అన్ని రకాల బియ్యం కార్డు కలిగిన వారికి కూడా ఈ పథకం వర్తించనుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్‌ పెన్షన్, జగనన్న విద్యా వసతి దీవెన కార్డులు ఉన్న కుటుంబాలు కూడా అర్హులుగా తేల్చుతూ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో 130 ఆసుపత్రుల్లో ఈ సేవలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే ప్రారంభించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com