ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెట్‌లాగా రాజకీయాల్లోనూ ఏమైనా జరుగవచ్చు : నితిన్‌ గడ్కరీ

national |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 10:15 AM

రాజకీయాలు కూడా క్రికెట్‌లాంటివేనని, క్రికెట్‌లో మాదిరిగానే రాజకీయాల్లో కూడా ఏమైనా జరుగవచ్చునని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. క్రికెట్‌ ఆడుతున్న సమయంలో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేమని, అలాగే రాజకీయాల్లో భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని ఆయన అన్నారు. మహారాష్ట్రలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉండటం, రాష్ట్రపతి పాలన విధించడంపై నితిన్‌ గడ్కరీని మీడియా ప్రశ్నించగా రాష్ట్రంలోని రాజకీయాల గురించి తనకు పూర్తి సమాచారం లేదని ఆయన సమాధానమిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com