అయోధ్యలోని రామమందిరానికి ముస్లిం సోదరుడు ఇక్బాల్ 2100 కేజీల బరువు గల గంటను బహుమతిగా ఇవ్వనున్నాడు. ఈ గంటకు పలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ గంట ఎత్తు ఏకంగా ఆరు అడుగులు, 5 అడుగుల వెడల్పు, 2100 కిలోల బరువు ఉంటుంది. ఈ గంటను అయోధ్యలో రామ్ మందిరం కోసం రూపొందించబడింది. ఇతను ఎటా జిల్లాలోని జలేసర్ లో హస్త కళలో నైపుణ్యం ఉన్నవాడు. బెల్ ఖర్చు సుమారు రూ .10 నుంచి 12 లక్షలు ఉంటుందని అంచనా.. కాగా రామ మందిరము కోసం తయారు చేసిన ఈ గంట తయారీ ప్రక్రియ చివరి దశలో ఉందని తెలిపారు.