ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వికెట్ దూరంలో అశ్విన్, కోహ్లీ ముంగిట అరుదైన రికార్డు!

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 07:23 PM

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ముగిసింది. దీంతో ఇరు జట్లు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌పై దృష్టి సారించాయి. ఇప్పటికే ఇండోర్‌కు చేరుకున్న ఇరు జట్ల ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. బంగ్లాతో తొలి టెస్టు గురువారం ప్రారంభమవుతున్నా.. టీమిండియా ఆటగాళ్ల ఆలోచనంతా డే/నైట్ టెస్టు మ్యాచ్‌పైనే ఉంది. కొత్త సవాల్‌కు సిద్ధమయ్యేందుకు సమయం తక్కువగా ఉండటంతో పూర్తిగా దృష్టంతా కోల్‌కతా టెస్టుపైనే పెట్టారు. పింక్ బాల్‌ను ఎలా ఎదుర్కోవాలి.. ఫ్లడ్‌లైట్ల కింద సుదీర్ఘ ఫార్మాట్ ఎలా ఉంటుందనే ఉత్సుకతతోనే నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. నెట్స్‌లో సైతం భారత జట్టులోని ఆటగాళ్లు పింక్ బాల్‌తోనే ప్రాక్టీస్ చేయడం విశేషం. డే/నైట్ టెస్టు మాట ఎలాగున్నా... సుదీర్ఘ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్ జట్టు టీమిండియాపై ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గలేదు. దీంతో ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కనీసం ఒక మ్యాచ్‌లోనే గెలవాలని ఊవిళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ టెస్టు గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం... 


టీమిండియానే విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో గెలిస్తే, టెస్టు క్రికెట్ చరిత్రలో తమ సుదీర్ఘ విజయ పరంపరను 2013లో వరుసగా ఐదు టెస్టు విజయాలను అధిగమిస్తుంది. 7/9 - భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇప్పటివరకు తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా ఏడు టెస్టుల్లో విజయం సాధించగా... వర్షం కారణంగా రెండు డ్రాగా ముగిశాయి. ఇందులో భారత గడ్డపై ఈ రెండు జట్లు గతంలో ఒకేసారి టెస్టు మ్యాచ్‌ను ఆడాయి. 2017లో హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. 7-0 - ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఆడిన ఏడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. భారత్‌ ఇక్కడ ఆడిన ఐదు వన్డేలు, 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్, 2017లో శ్రీలంకతో జరిగిన ట 20 మ్యాచ్‌లో విజయం సాధించింది. 50 - భారత్‌పై 50కిపైగా యావరేజిని కలిగిన బంగ్లాదేశ్ క్రికెటర్లుగా ముష్ఫికర్ రహీమ్(56.16), మహ్మదుల్లా(55.4)లు ఉన్నారు. భారత్‌పై ముష్ఫికర్ రహీమ్ 337 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. భారత్‌తో ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో మహ్మదుల్లా 277 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 249 - స్వదేశంలో 41 టెస్టు మ్యాచ్‌లాడిన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు పడగొట్టిన వికెట్ల సంఖ్య. మరో వికెట్ తీస్తే సొంతగడ్డపై 250 వికెట్లు తీసిన మూడో భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో వికెట్ తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 250 వికెట్లు మైలురాయిని అందుకుంటాడు. 398 - అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ ఇప్పటివరకు బాదిన సిక్సుల సంఖ్య. మరో రెండు సిక్సులు బాదితే 400 సిక్సుల క్లబ్‌లో చేరిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సృష్టిస్తాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(534) అగ్రస్థానంలో ఉండగా... షాహిద్ అఫ్రిది(476) సిక్సులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ బ్రెండన్ మెక్‌‌కల్లమ్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 4968 - విరాట్ కోహ్లీ మరో 32 పరుగులు చేస్తే టెస్టుల్లో 5000 పరుగులు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. మొత్తంగా 6వ క్రికెటర్ కావడం విశేషం. అంతేకాదు టెస్టుల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సృష్టిస్తాడు. 14934 - ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 15000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి పుజారాకు కావాల్సిన పరుగులు 66. పుజారా ఇప్పటివరకు 192 మ్యాచ్‌ల్లో 14934 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com