ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ కళాకారుడికి ఇంతకు మించి అభినందన ఏముంటుంది…

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 05:27 PM

అతడి వయస్సు కేవలం 21 సంవత్సరాలు.. పుట్టుకతోనే రెండు చేతులు లేవు. కానీ కాలితో  పెయింటింగ్ వేయడంలో అత్యంత ప్రతిభావంతుడు. అతడే కేరళ లోని పాలక్కాడ్‌ నివాసి అయినా ప్రణవ్‌.. ఇటీవలే  బీకామ్‌ కూడా పూర్తి చేశాడు. అయితే తన 21వ పుట్టినరోజు సందర్భంగా  తిరువనంతపురంలోని లెజిస్లేటివ్‌ కార్యాలయానికి మంగళవారం వచ్చి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కు సిఎం విపత్తుల సహాయ నిధి కోసం రూ.5వేల  చెక్కును అందజేశాడు. అంతే కాదు  చెక్కుపై తన కాలి వేళ్ళతో సంతకం చేసి   సీఎం కి ఇచ్చాడు ప్రణవ్. “మీతో నా పుట్టినరోజుని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది..మీపై పూర్తి నమ్మకం ఉంది, మాలాంటి వారిని ఆదుకునేందుకు మీరు ఎప్పుడూ ముందుటారు” అని  పినరయి విజయన్‌ కు  ప్రణవ్ ప్రశంసించాడు..అనంతరం షేక్ హ్యాండ్ కోసం చేయి లేకపోవడంతో తన కాలును ముఖ్యమంత్రికి అందించాడు..ముఖ్యమంత్రి ఏ మాత్రం తడబాటు లేకుండా అతడి కాలు చేత్తో అందుకుని చక్కగా  షేక్ హ్యాండ్ ఇచ్చారు.. ఆ తర్వాత ప్రణవ్ తన సెట్ ఫోన్ ను బయటకు తీసి  తన కాలితోనే పినరయి  తో ఓ సెల్ఫీ తీసుకున్నాడు.  దీంతో  ప్రణవ్ ప్రతిభను  చూసి కేరళ ముఖ్యమంత్రి ముగ్ధుదయ్యాడు. అంగవైకల్యాన్ని జయించి చిత్రకారుడిగా రాణిస్తున్నా ప్రణవ్ ని చూసి ముఖ్యమంత్రి ఫిదా అయ్యాడు. అతని ఔదార్యాన్ని మెచ్చుకుంటూ తన ఫేసుబుక్ లో ప్రణవ్ గురించి రాసారు పినరయి విజయన్‌. “ఈరోజు లెజిస్లేటివ్‌ కార్యాలయానికి రాగానే నాకు ఒక మంచి అనుభవం ఎదురైంది. అలతుర్ ప్రాంతానికి చెందిన ఓ చిత్రకళాకారుడు తన పుట్టినరోజు సందర్భంగా తన వంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం ఇచ్చాడు. ప్రణవ్ తో సహా అతని తల్లిదండ్రులు బాలసుబ్రమణియన్‌, స్వర్ణకుమారి, స్థానిక ఎమ్మెల్యే అయినా కేడీ ప్రసన్న కూడా వచ్చారు. అతడు అందించిన విరాళం ఎంతో గొప్పది”, అని పినరయి విజయన్‌ తన ఫేసుబుక్ పోస్ట్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చిన విరాళం కూడా రియాలిటి షో లలో బొమ్మలు గీసి సంపాదించినవి కావడం విశేషమంటూ ప్రశంసలు కురిపించారు పినరయ్..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com