ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్యకు గురైన తైక్వాండో క్రీడాకారిణి సరిత

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 12:13 PM

తైక్వాండో క్రీడాకారిణి సరిత(25) దారుణ హత్యకు గురైంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో బోరాఖుర్ద్‌ గ్రామంలో మంగళవారం మధ్యాహ్న సమయంలో ఓ యువకుడు సరితను కాల్చి చంపినట్లు సమాచారం . విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకోగా.. రక్తపు మడుగులో పడిఉన్న ఆమెను తైక్వాండో క్రీడాకారిణి సరితగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్య వెనుక సరిత కోచ్‌ హస్తం దాగుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో సరిత కోచ్‌ ఆమెను వివాహం చేసుకోవాలని పలుమార్లు వేధిస్తుండగా.. సరిత తిరస్కరిస్తూ వస్తోందని, దీంతో పెళ్లి విషయమై వీరివురి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని, పెళ్లికి నిరాకరించడంతోనే కోచ్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు' వారు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు కోచ్‌పై కేసు నమోదు చేశారు. హత్య అనంతరం కోచ్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com