ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మిత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు...

international |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 05:53 PM

షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా న్యూ సౌత్ వేల్స్ జట్టుకు ఆడుతోన్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 290 బంతుల్లో సెంచరీని సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో స్మిత్‌కు ఇది 42వ సెంచరీ. ఈ క్రమంలో స్మిత్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే ఫస్ట్ క్లాస్ కెరీర్‌లోనే అత్యంత నెమ్మదిగా సెంచరీ ఇదే కావడం విశేషం. దీనికి ముందు 2017/18 యాషెస్ సిరిస్‌లో గబ్బా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 261 బంతుల్లో సెంచరీ సాధించాడు. డానియేల్ సోల్వేతో కలిసి రెండో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన స్టీవ్ స్మిత్... మొయిస్ హెన్రీక్యూస్‌తో కలిసి మూడో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యాన్న నెలకొల్పాడు. అయితే, ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ ఔట్ మాత్రం అనూహ్యంగా జరిగింది. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో అప్పక్ కట్ ఆడే ప్రయత్నంలో స్టీవ్ స్మిత్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే, తొలుత తన ఔట్ విషయంలో అయోమయం నెలకొన్నప్పటికీ... అంఫైర్ ఔట్ ఇవ్వడంతో స్టీవ్ స్మిత్ నిరాశగా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో స్టీవ్ స్మిత్(103) సెంచరీ అనంతరం నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. స్మిత్ సెంచరీతో న్యూ సౌత్ వేల్స్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 314/4 పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ ఏడాది స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యాషెస్ సిరిస్‌లో భాగంగా నాలుగు టెస్టులాడిన స్టీవ్ స్మిత్ 774 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 2019లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య నవంబర్ 21న గబ్బా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. కాగా, పాకిస్థాన్‌పై స్టీవ్ స్మిత్ అద్భుతమైన టెస్టు గణాంకాలను కలిగి ఉన్నాడు. పాక్‌పై మొత్తం ఏడు టెస్టులు ఆడిన స్టీవ్ స్మిత్ రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. 2017లో మెల్ బోర్న్ వేదికగా పాక్‌తో జరిగిన టెస్టులో స్టీవ్ స్మిత్(165 నాటౌట్) ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు గుర్తే. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com