ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిన్న బంగ్లా నేడు విదర్భ 3 రోజుల వ్యవధిలో రెండో హ్యాట్రిక్

national |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 05:38 PM

మూడో రోజుల వ్యవధిలోనే టీమిండియా పేసర్ దీపక్ చాహర్ రెండో హ్యాట్రిక్‌ను సాధించాడు. నాగ్‌పూర్ వేదికగా గత ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా, మంగళవారం ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ సాధించాడు. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా మంగళవారం త్రివేండ్రం వేదికగా విధర్భ-రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విదర్భ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన దీపక్ చాహర్ దర్శన్ నల్కండే, శ్రీకాంత్ వాగ్(13), అక్షయ్ వాడ్కర్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చడం ద్వారా ఈ ఘనత సాధించాడు. దర్శన్ నల్కండే, అక్షయ్ వాడ్కర్‌లు డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్(4/18)తో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు నిర్ణీత 13 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. కాగా, నాగ్‌పూర్ వేదికగా ముగిసిన మూడో టీ20లో దీపక్‌ చాహర్‌ తన కోటా (3.2) పూర్తికాకముందే 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చిన దీపక్‌.. తర్వాత ఓవర్లో వికెట్‌ తీయడంతో పాటు 4 పరుగులు ఇచ్చాడు. 18వ ఓవర్‌ చివరి బంతికి షఫీయుల్‌ వికెట్‌ను దీపక్ తీసాడు. ఇక 20వ ఓవర్‌ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్‌లను అవుట్‌ చేసి 'హ్యాట్రిక్‌'తో పాటు ప్రపంచ రికార్డును నమోదు చేసిన సంగతి తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com