స్టీవ్ స్మిత్ (51 బంతుల్లో 80 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) ఆస్ట్రేలియా గెలిచేదాకా దంచేశాడు. దీంతో రెండో టి20లో కంగారూ జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఇఫ్తెకార్ అహ్మద్ (34 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (38 బంతుల్లో 50; 6 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. ఆసీస్ బౌలర్ అగర్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 18.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. వార్నర్ (20), ఫించ్ (17) జట్టు స్కోరు 50 పరుగులలోపే నిష్క్రమించగా... స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతని దూకుడు జట్టు గెలిచేదాకా అడ్డుఅదుపు లేకుండా సాగింది. స్మిత్, మెక్‌డెర్మట్ (21)తో కలిసి మూడో వికెట్‌కు 58 పరుగులు జోడించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టి20 వర్షంతో రద్దవగా... ఆసీస్ 1–0తో ఆధిక్యంలో ఉంది. ఆఖరి మ్యాచ్ 8న పెర్త్‌లో జరుగుతుంది.