ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో డిగ్రీ కోర్సుల సిలబస్‌లో మార్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 05, 2019, 12:26 PM

డిగ్రీ కోర్సుల సిలబ్‌సలో మార్పులు జరగనున్నాయి. 2015-16 విద్యా సంవత్సరంలో డిగ్రీ సిలబ్‌సలో మార్పులు చేయగా.. ఐదేళ్ల తర్వాత మరోసారి మార్పులకు రంగం సిద్ధమవుతోంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలోని వర్సిటీలకు అనుబంధంగా ఉన్న అన్ని డిగ్రీ కాలేజీల్లో మార్పులు అమలు చేస్తారు. ఇప్పటికే అమల్లో ఉన్న చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం(సీబీసీఎ్‌స)లో భాగంగా డిగ్రీ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి(స్కిల్‌ డెవల్‌పమెంట్‌)కి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. మూడేళ్ల రెగ్యులర్‌ డిగ్రీ కోర్సులైన బీకాం, బీఎస్సీ, బీఏలతో పాటు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ను చేసేందుకు విద్యార్థులకు అవకాశం కలగనుంది. డిగ్రీతో సమాంతరంగా ఈ కోర్సును ఎంచుకునే విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేయడాన్ని తప్పనిసరి చేయబోతున్నారు.


 ఈ దిశగా డిగ్రీ సిలబ్‌సలో మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. డిగ్రీ చదువుతూనే.. తనకు ఆసక్తి ఉన్న స్కిల్స్‌పై సదరు విద్యా సంస్థలో అందుబాటులో లేకుంటే మరో కాలేజీ లేదా విద్యా సంస్థలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సు చేసేందుకు వెసులుబాటు కల్పించే విషయమై చర్చ జరుగుతోంది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సు పూర్తికాగానే సదరు విద్యా సంస్థలోనే పరీక్షలు రాసి క్రెడిట్లు పొందుతారు. ఆ నైపుణ్య కోర్సులో విద్యార్థి సాధించిన క్రెడిట్స్‌ను రెగ్యులర్‌ డిగ్రీ సర్టిఫికెట్‌లో పొందుపరుస్తారు. ఒకేసారి రెగ్యులర్‌ డిగ్రీతో పాటు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సు సర్టిఫికెట్‌ లభిస్తుంది.


 డిగ్రీతో పాటు విద్యార్థిలోని స్కిల్స్‌ను గుర్తించే దిశగా ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోని అకడమిక్‌ కమిటీ ఆలోచన చేస్తోంది. బీకాం కోర్సుతో సమాంతరంగా అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌ కోర్సు ను ఎంచుకోవచ్చు. సదరు కోర్సు చేసే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయడం వల్ల వెంటనే ఉద్యోగానికి సిద్ధమైనట్టే. బీఎస్సీ చదివే విద్యార్థులు జువాలజీకి సంబంధించిన ఆక్వాకల్చర్‌(రొయ్యల పెంపకం)ను ఎంచుకోవచ్చు. బీఎస్సీ(ఫిజిక్స్‌) విద్యార్థులు టెలికమ్‌ ఇండస్ట్రీపై స్కిల్‌ కోర్సును ఎంచుకోచ్చు. అలాగే బీఏ విద్యార్థులు ఫ్యాషన్‌ టెక్నాలజీ వంటి స్కిల్స్‌ ఉన్న కోర్సును ఎంచుకోవచ్చు. ఒక సంస్థలో బీఏ చదివే విద్యార్థికి ఐటీ సబ్జెక్టుపై ఆసక్తి ఉంటే, తాను చదువుతున్న సంస్థలో అర్హత కలిగిన ఫ్యాకల్టీ లేకపోతే ఈ కోర్సు చేసేందుకు ఇప్పటి వరకు మరో అవకాశం లేదు. కానీ, ఇప్పుడు సదరు విద్యార్థి మరో ఇంజనీరింగ్‌ కాలేజీకి వెళ్లి సంబంధిత స్కిల్స్‌ ఉన్న సబ్జెక్టును ఎంచుకుని కోర్సు పూర్తి చేయొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com