ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా ఎవరైనా రనౌట్ చేస్తారా?

international |  Suryaa Desk  | Published : Thu, Oct 31, 2019, 01:21 PM

శ్రీలంక స్పిన్నర్ లక్షణ్‌ సందకన్‌‌కు రనౌట్ రూల్స్ తెలిసినట్టు లేవు. దీంతో స్కూల్ బాయ్ మాదిరి ప్రవర్తించాడు. ఒత్తిడికిలోనై ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను రనౌట్ చేసే గొల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకున్నాడు. ఈ సంఘటన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే....సందకన్‌ బౌలింగ్‌లో వార్నర్‌ షాట్ ఆడాడు. అయితే, బంతి నేరుగా వికెట్లకు తాకి బెయిల్స్‌ కిందపడ్డాయి. అదే సమయంలో అవతల ఎండ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో క్రీజు వదలి సగం పిచ్ వరకు పరుగెత్తాడు. దీంతో సందకన్ వెంటనే బంతిని అందుకున్నాడు. కంగారులో వికెట్ల గిరాటేయడం మరచిపోయి కుడిచేతిలో బంతిని ఉంచి ఎడమచేతితో స్టంప్‌ను పైకి తీశాడు. దీంతో స్మిత్‌ ఔట్ కాస్త నాటౌట్ అయింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బెయిల్స్‌ పడిన సందర్భంలో బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌ చేయాలంటే బంతితో మరోసారి వికెట్లను పడగొట్టాలి. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com