కండలేరు లెఫ్ట్ కెనాల్, హై లెవల్ కెనాల్, సోమశిల దక్షిణ కాలువ నిర్మాణాలు వైఎస్సాఆర్ పుణ్యమేనని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన బతికి వుండి వుంటే చివరి ఆయకట్టు వరకు సాగునీరు అంది వుండేదన్నారు. అయితే గత ప్రభుత్వాల సాగునీటి రాజకీయాలతో అభివృద్దిని భ్రష్టు పట్టించారన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం జిల్లాపై, సర్వేపల్లి నియోజకవర్గంలో సాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అటవీశాఖ అనుమతుల విషయంలో ఫారెస్ట్ ఆఫీసర్లతో కలెక్టర్ సమావేశమై చర్చించారని స్పష్టం చేశారు.