ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నారి అభిమానికి బహుమతి ఇచ్చిన వార్నర్

international |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 01:43 PM

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, విధ్వంసక ఆటగాడు డేవిడ్‌ వార్నర్ చెలరేగడంతో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 134 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వార్నర్‌ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి సెంచరీ (100; 56 బంతుల్లో 10x4,4x6) చేసాడు. ఈ సెంచరీని వార్నర్ తన బర్త్‌డేకి తనే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆసీస్‌ జట్టు టీ20ల్లోనే అత్యుత్తమ విజయం సాధించింది. తొలి టీ20 మ్యాచ్‌కు ముందు వార్నర్‌ ఓ అభిమానిని ఆశ్చర్యపర్చాడు. స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసి తిరిగి డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్తున్న సమయంలో అక్కడ సందడి చేస్తున్న ఓ బాలుడికి వార్నర్ తన గ్లోవ్స్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ బాలుడి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వార్నర్‌ ఇచ్చిన గ్లోవ్స్‌ను చూసుకుంటూ సంతోషపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్‌.కామ్‌ వెబ్‌సైట్‌ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వార్నర్‌ ఇలా అభిమానులకు బహుమతి ఇవ్వడం తొలిసారి ఏమీ కాదు. గత వన్డే ప్రపంచకప్‌లోనూ ఓ చిన్నారికి బహుమతి ఇచ్చి ఆశ్చర్యపర్చాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన వార్నర్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు' దక్కింది. తనకు లభించిన ఆ అవార్డును మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ చిన్నారికి బహుమతిగా ఇచ్చేశాడు. అనుకోకుండా తనకు అందిన వార్నర్ బహుమతిని చూసి చిన్నారి ఎంతో సంతోషించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com