ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపావళి విశిష్టతను వివరించిన పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2019, 06:03 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపాన్ని భారతీయులు పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారని, మనోవికాసానికి ప్రతీకగా పరిగణిస్తారని ట్విట్టర్ లో వివరించారు. కులమతాలకు అతీతంగా భారతీయులందరూ జరుపుకునే పండుగ దీపావళి అని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శ్రమజీవుల జీవితాల్లో ఈ దీపకాంతులు కొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వర్షాకాలంలో వచ్చే క్రిమికీటకాలు అనారోగ్యాలు కలిగిస్తుంటాయని, వాటిని పారద్రోలేందుకే దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చుతుంటారని పవన్ వెల్లడించారు.అయితే పర్యావరణానికి భంగం కలగని రీతిలో పరిమితంగా బాణసంచా కాల్చాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com