క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్‌లో అమెజాన్ టాప్. కానీ అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ డీల్ దక్కింది. సుమారు వెయ్యి కోట్ల డాలర్ల వ్యాపారాన్ని స్వదేశానికి చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీకే పెంటగాన్ అప్పగించింది. వివాదాస్పద ఒప్పందాన్ని మైక్రోసాఫ్ట్‌కు ఇవ్వడం పట్ల అమెజాన్ ఆశ్యర్యాన్ని వ్యక్తం చేసింది. కాంట్రాక్టు తమకు దక్కుతుందని భావించిన అమెజాన్‌కు నిరాశ ఎదురైంది. జెఫ్ బేజోస్ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వకూడదంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీకి చెందిన డేటాను మేనేజ్ చేసే విషయంలో అమెజాన్ అగ్రస్థానంలో ఉన్నది. కానీ స్వదేశీ సంస్థలను విస్మరించరాదు అని ఒత్తిడి పెరగడంతో.. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చట్టాలు, నిబంధనల ప్రకారమే ఒప్పందం ఉంటుందని అమెరికా రక్షణశాఖ పేర్కొన్నది.