కొత్త కొత్త అప్ డేట్స్ ని ప్రవేశ పెడుతున్న ఫేస్ బుక్ మరో కొత్త ఫీచర్ ని ప్రవేశ పెట్టింది. . న్యూస్ ఫీడ్ ఫీచర్ ఉన్నా, ప్రత్యేకంగా తాజా వార్తలు, కథనాల కోసం న్యూస్ విభాగాన్ని ప్రారంభిస్తోంది. ఇందులో స్థానిక మీడియా సంస్థల కథనాలు, పాత్రికేయులు ఎంపిక చేసిన కథనాలకు ఫేస్ బుక్ న్యూస్ విభాగంలో చోటు కల్పిస్తారు. ప్రత్యేకమైన ఆల్గోరిథమ్ ద్వారా యూజర్ల అభిరుచులకు అనుగుణంగా వార్తలు కనిపించేలా ఈ న్యూస్ విభాగాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు, పెయిడ్ న్యూస్ సబ్ స్క్రిప్షన్లను ప్రచారం చేసుకునే వారికి అనువుగా ఇందులోనే ప్రత్యేక విభాగం ఉంటుంది. కాగా ఇది ఈ ఫీచర్ ప్రస్తుతానికి పైలెట్ ప్రాజెక్టుగా అమెరికాలో కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.